DSC 2023 : ఒక్కో పోస్టుకు SA – 53, SGT – 26 మంది పోటీ

హైదరాబాద్ (నవంబర్ – 02) : తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ భర్తీ చేయనున్న మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీలకు గాను 1,77,502 దరఖాస్తులు అందాయి. ఈ DSC 2033 నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ (SA) ఉద్యోగాలకు అధిక పోటీ నెలకొంది.

1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 91,931 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 53 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

రాష్ట్రవ్యా ప్తంగా 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు 66,376 దరఖాస్తులు వచ్చాయి. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 26 మంది పోటీ పడుతున్నారు.

164 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) కొలువులకు 6,856 దరఖాస్తులు (ఒక్కో పోస్టుకు 42), 611 భాషా పండితుల పోస్టులకు 12,339 దరఖా స్తులు(ఒక్కో పోస్టుకు 20) అందాయి.