Contract employees : అధ్యాపకుల రెన్యూవల్ జీవో విడుదల

హైదరాబాద్ (జూలై – 06) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైం ,అవుట్సోర్సింగ్ ఉద్యోగులను 2023 – 24 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవడానికి కాలేజీయోట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కు అనుమతి ఇస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. Contract employees

2023 జూన్ 1 నుండి 2024 మార్చి 31వ తేదీ వరకు వీరి సేవలను ఉపయోగించుకోవాలని ఉత్తర్వులలో పేర్కొంది.

కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్లు 527 మంది, TSKC ఫుల్ టైం మెంటార్స్ 50 మంది, గెస్ట్ అధ్యాపకులు 1940, మంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది 341 మంది… మొత్తం 2,858 మందిని రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.