డిగ్రీ ఒప్పంద అధ్యాపకుల రెన్యూవల్ ఉత్తర్వులు విడుదల.

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న 825 కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ లను 2020 – 21 విద్యా సంవత్సరానికి ఒక్కరోజు బ్రేక్ లేకుండా రెన్యువల్ చేస్తూ ప్రోసిడింగ్ ను తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ఈరోజు విడుదల చేశారు.

తమ రెన్యువల్ ప్రోసిడింగ్స్ ను ఎలాంటి బ్రేక్ లేకుండానే CCE అధికారులు క్రోద్ధి సేపటి క్రితం విడుదల చేశారని, ఎటువంటి బ్రేక్ లేకుండా రెన్యూవల్ ప్రొసీడింగ్స్ విడుదల కొరకు సహకారాన్ని అందించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, కళాశాల విద్యా కమీషనర్ నవీన్ మిట్టల్ కి ప్రత్యేక ధన్యవాదాలు TDCLA అధ్యక్షుడు ఎమ్. వినోద్ కుమార్ తెలిపారు. ధన్యవాదాలు తెలిపిన వారిలో జనరల్ సెక్రటరీ కాదరవల్లి , రాష్ట్ర కమిటీ సభ్యులు కిరణ్మయి మేడం , మహేష్ కుమార్ , రామన్ గౌడ్, వినయ్ , బాలరాజు, కల్పన ధన్యవాదాలు తెలియచేసారు

PROCEEDING PDF FILE

https://drive.google.com/file/d/1VqTL5xQbAwOhkceKw97dJ4Yz1nFcBMJL/view?usp=drivesdk

Follow Us @