హైదరాబాద్ (జూన్ – 27) : తెలంగాణ రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో సీట్లన్నీ ప్రవేశ పరీక్షలో సాదించిన మెరిట్ ప్రకారమే భర్తీ చేస్తున్నామని, సీట్ల కోసం మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. సీట్లు కావాలంటూ కార్యాలయాల్లో దరఖాస్తు ఇవ్వొద్దని సూచించారు. ఎవరైనా సీట్లు ఇప్పిస్తామని చెబితే వారి మాటలు నమ్మవద్దని, అలాంటి వ్యక్తులపై 040 – 23120496 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.