ఈ అసెంబ్లీ సమావేశాలలోనే పీఆర్సీ కమిటీ & ఐఆర్ ప్రకటన – కేసీఆర్ హమీ

హైదరాబాద్ (ఆగస్ట్ – 04) : ఉద్యోగ సంఘాల ఐకాసానేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విన్నవించగా ఈ అసెంబ్లీ సమావేశాలలోనే పిఆర్సి కమిటీని ఏర్పాటు చేస్తామని ఐఆర్ ను ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు మ ఉద్యోగ సంఘా నేతలు ప్రకటించారు. అలాగే ఉద్యోగుల, పెన్షన్ దారుల ఆరోగ్య భద్రత కార్డులను కూడా అందజేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నేతలు 2023 జులై 1 నుంచి అమలయ్యేలా ఐఆర్ ను ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం జరిగేలాళచూడాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం తామిచ్చే చందాతో కూడిన ట్రస్టును ఏర్పాటు చేసి, మెరుగైన వైద్యసేవలు అందేలా EHS ను తీర్చిదిద్దాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు.

గోపనపల్లిలో సర్వే నంబరు 36, 37లో గతంలో ఉద్యోగులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని భాగ్యనగర్ ఎన్టీవోస్ హౌజింగ్ సొసైటీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఐకాస నేతలు ముఖ్యమంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శుక్ర, శనివారాల్లో ఏదో ఒక రోజు వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై అసెంబ్లీలోనే ప్రకటిస్తామని సీఎం చెప్పినట్లుగా ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు తెలిపారు.