ssc exam with 6 papers

హైద‌రాబాద్ (అక్టోబర్ – 13) : తెలంగాణ రాష్ట్రంలో ప‌దవ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లను ఈ విద్యా సంవ‌త్స‌రం కూడా 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్లే నిర్వ‌హించాల‌ని (ssc exam with 6 papers) విద్యాశాఖ ప్ర‌తిపాదించింది.ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా 2021లో 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్ల‌కు కుదిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఏడాది క‌రోనా ఉధృతి కార‌ణంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వీలు కాలేదు. ఇక 2022లో 6 పేప‌ర్ల‌కు కుదించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మ‌ళ్లీ తాజాగా 2023 లోనూ 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ప్ర‌భుత్వం.