హైదరాబాద్ (మే – 10) : తెలంగాణ పదవ తరగతి ఫలితాలు (TS 10th RESULTS 2023) ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పది పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. టెన్త్ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా, 4,84,384 మంది ఎగ్జామ్స్ రాశారు.