తెలంగాణ విద్యా దినోత్సవ కార్యక్రమాలు

హైదరాబాద్ (జూన్ 19) : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ – 20 నాడు తెలంగాణ విద్యా దినోత్సవం జరపనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి విద్యా వ్యవస్థలో వచ్చిన గుణాత్మక, పరిమాణాత్మక మార్పులను‌, ఆభివృద్దిని గుర్తు చేసుకుంటూ ప్రతి విద్యా సంస్థలో పతాక వందనం కార్యక్రమం ఉంటుంది.

★ తెలంగాణ విద్యా దినోత్సవ కార్యక్రమాలు

1) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు, అన్ని గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యా సంస్థల్లో ఉదయం పతాక వందనం చేయాలి. తదనంతరం సభలో విద్యారంగంలో తెలంగాణ సాధించినవిజయాలను పేర్కొనాలి.

2) ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మనఊరు మన బడి పాఠశాలల ప్రారంభోత్సవం నిర్వహించాలి.

3) సిద్ధంగా ఉన్న పది వేల గ్రంథాలయాలను, 1600 డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభించాలి.

4) పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలి.

5) ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో, పూలతో అందంగా అలంకరించాలి.

6) విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు మన బడి కార్యక్రమంతో పాటు, 1,001 గురుకులాల స్థాపన, నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటు (హార్టికల్చర్, ఫారెస్ట్, మహిళ, హెల్త్ యూనివర్సిటీ, తదితర) జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు., నూతనంగా నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు (రెసిడెన్షియల్ తో సహా), డిగ్రీ కాలేజీల (రెసిడెన్షియల్ తో సహా) ఏర్పాటు తదితర వివరాలను వెల్లడించాలి.