రాష్ట్రంలో హరిత నిధి వసూళ్లు మొదలుకానున్నాయి. రాష్ట్రంలో పచ్చ దనాన్ని పెంపొందించేందుకు తీసుకొచ్చిన హరిత హారం పథకం కోసం ప్రభుత్వం హరిత నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రక టించారు. హరిత నిధి పేరుతో విరాళాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఏటా ఏప్రిల్ నెల జీతాలు చెల్లింపుల నుంచి (అంటే మే నెలలో జమ చేసే వేతనాలు) కట్ చేయనున్నారు.
హరిత నిధి వసూల్ ఇలా.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.300
అఖిల భారత సర్వీసు ఉద్యోగుల నుంచి రూ. 1200
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు జీతాల నుంచి ఏడాదికి విరాళంగా రూ.6000
జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఏడాదికి విరాళంగా 1200
ఎంపీపీలు, జడ్పీటీసీల నుంచి ఏడాదికి విరాళంగా 5.600
ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్ ల ఏడాదికి రూ. 120
ఇంజినీరింగ్ కాంట్రాక్టుల నుంచి 0.01 శాతం “నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 10 శాతం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఒక్కో రిజిస్ట్రేషన్ కు రూ.50
వాణిజ్య సముదాయాల ఒక్కో అనుమతికి .1000
బార్లు, మద్యం దుకాణాల ఒక్కో అనుమతికి-రూ. 1000
పదోతరగతి వరకు ప్రతి విద్యార్థి నుంచి రూ.10
ఇంటర్ విద్యార్థుల నుంచి రూ. 15, డిగ్రీ విద్యార్థుల నుంచి రూ.25
ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల నుంచి రూ. 100 చొప్పున సేకరించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Follow Us @