BIKKI NEWS (JUNE 21) : Telanagana Vidya commission review on pressure on inter students ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మానసిక, ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలని తెలంగాణ విద్యా కమిషన్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.
Telanagana Vidya commission review on pressure on inter students
జూన్ 20వ తేదీన హైదరాబాద్ లో తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులపై మానసిక, ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి జరిగిన BRAIN STORMING సమావేశంలో జేఎన్టీయూ మరియు ఇంటర్ బోర్డు అధికారులు, పేరెంట్స్ , ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, పేరెంట్స్ పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షల సంబంధించిన మానసిక, ఆర్థిక ఇబ్బందులను తెలంగాణ విద్యా కమిషన్ తో చర్చించడం జరిగింది.
ఈ విషయాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా TGJLA_475 సంఘం నుంచి కొన్ని సూచనలు తెలంగాణ విద్యా కమిషన్ కు అందజేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో గత విద్యా సంవత్సరంలో(2024 – 2025) ఇంటర్ బోర్డు ద్వారా 4,58,185 విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయడం జరిగిందని, CBSE ద్వారా 12వ తరగతి 8,443 మంది విద్యార్థులు పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. ఇందులో ఎం.పీ.సీ, బైపీసీ,3,33,874 విద్యార్థులు చదవటం జరిగిందని, ఇందులో 2,20,327 విద్యార్థులు తెలంగాణ EAPCET ఎంట్రన్స్ అటెండ్ కావడం జరిగిందని, ఇందులో 2,07,790 మంది విద్యార్థులు ఇంజనీరింగ్,86,762 మంది విద్యార్థులు అగ్రికల్చరల్ ఎంట్రన్స్ కు అటెండ్ కావడం జరిగిందని తెలిపారు.
వీటితోపాటు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు జాతీయస్థాయి పరీక్షలైన JEE MAINS, ADVANCE, NEET, CUET మొదలైన పోటీ పరీక్షలకి హాజరవుతున్నారని తెలిపారు.
ఇందులోJEE మెయిన్స్, అడ్వాన్స్,NEET ఎంట్రన్స్ వల్ల విద్యార్థులపై విపరీతమైన మానసిక ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఈ ఎంట్రన్స్ ల పేర్లతో కార్పొరేట్ కళాశాలలో మెడికల్ అకాడమీ పేరుతో వివిధ సంస్థల విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నాయని వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేదని తెలిపారు.
ఈ విషయాలను పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులపై మానసిక, ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరు మురళి ఐఏఎస్, తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు శ్రీ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, విద్యా కమిషన్ సభ్యులు జోత్స్న రెడ్డి, వెంకటేష్, జెఎన్టియు అధికారులు, ఇంటర్మీడియట్ విద్య ఆఫీసర్ శ్రీ లక్ష్మారెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటయ్య,. అధ్యాపకులు కే విజయలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు తరపున అత్తినేని శ్రీనివాస్, జి. విశాలాక్ష్మి మొదలైన వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ గారికి TGJLA_475 అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు శ్రీ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ అనేక సూచనలతో విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్