INDvsBAN – టీమిండియా రికార్డు స్కోర్

BIKKI NEWS (OCT. 12) : Team india record score in t20 match. ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ టీ20 చరిత్రలోభారత్ కు రికార్డు స్కోర్ ను సాధించింది. 20 ఓవర్లలో 297/6 పరుగులు సాదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా సంజు శాంసన్ 40 బంతుల్లో సెంచరీ (111), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (75), పరాగ్ (34), హర్దిక్ పాండ్యా (47) పరుగులతో రాణించడం తో భారీ స్కోరు సాదించింది.

భారత బ్యాట్స్ మన్ 22 సిక్సర్స్ కొట్టడం విశేషం. అలాగే 25 పోర్లు కోట్టారు. దీంతో మొత్తం మీద 47 బౌండరీలు సాదించారు.

సంజూ శాంసన్ భారత్ తరపున ఇంటర్నేషనల్ టీట్వంటీ లలో రెండో వేగవంతమైన సెంచరీ 40 బంతుల్లో సాదించాడు. రోహిత్ శర్మ మరియు డేవిడ్ మిల్లర్ లు 35 బంతుల్లోనే సెంచరీ సాదించి మొదటి స్థానంలో ఉన్నారు.

సంజూ శాంసన్ భారత్ తరపున వేగవంతమైన అర్ర సెంచరీ 22 బంతుల్లో సాదించి రోహిత్ శర్మ 23 బంతుల రికార్డు ను బ్రేక్ చేశాడు.

టీమిండియా రెండో అత్యధిక స్కోర్ 297/6 సాదించింది. నేపాల్ జట్టు 314/3 పరుగులను మంగోలియా పై సాదించి మొదటి స్థానంలో ఉంది.

అత్యధిక సిక్స్ లను నేపాల్ జట్టు 26 సాదించి మొదటి స్థానంలో ఉండగా, జపాన్ 23 సిక్సర్స్ తో రెండో స్థానంలో ఉంది.

పవర్ ప్లే లో భారత్ కు ఇదే అత్యధిక స్కోర్ 82/1

పదో ఓవర్లో వరుసగా 5 సిక్సర్స్ ను సంజూ శాంసన్ కొట్టాడు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు