TEAM INDIA IN SEMIS – సెమీస్ కు చేరిన టీమిండియా

BIKKI NEWS (JUNE 24) : team india reaches semi finals in t20 world cup 2024. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించి సెమీ ఫైనల్ కు కు దూసుకెళ్లింది. ఇప్పటికే ఇంగ్లాండ్, సౌత్ఆఫ్రికా జట్లు సెమీస్ కు చేరగా తాజాగా భారత్ సెమిస్ కు చేరింది. ఈ టోర్నీలో ఇంతవరకు భారత చట్టం ఓటమిని చవి చూడలేదు

టీం ఇండియా తన సెమి ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో జూన్ 27వ తేదీన ఆడనుంది. సౌత్ ఆఫ్రికా తో సెమీఫైనల్ ఆడే జట్టు రేపు తేలనుంది. ఆఫ్గానిస్థాన్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిస్తే సౌత్ఆఫ్రికాతో తలపడనంంది. లేదా బంగ్లాదేశ్ గెలిస్తే రన్ రేట్ ఆధారంగా ఆధారంగా ఆస్ట్రేలియా లేదా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరనున్నాయి.

team india reaches semi finals in t20 world cup 2024

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, కెప్టెన్ రోహిత్ శర్మ వీర విహారంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణయిత 20 ఓవర్లలో 205 పరుగులు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ – 92, సూర్యకుమార్ యాదవ్ – 31, శివం దూబే – 28, హార్థిక్ పాండ్యా 27 పరుగులతో రాణించారు

ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, స్టోయినిస్ – 2, హెజిల్ వుడ్ – 1 చొప్పున వికెట్లు తీశారు.

అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు భారత్ కం ట్రావిస్ హెడే హెడెక్ గా మారాడు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపు తధ్యమైంది. ఆసీస్ బ్యాట్స్‌మన్ లలో ట్రావిస్ హెడ్ 76, కెప్టెన్ మార్స్ 37, గ్లెన్ మాక్స్వెల్ 20 పరుగులతో రాణించారు.

భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ – 3, కులదీప్ యాదవ్ – 2 అక్షర పటేల్, బుమ్రా ఒకొక్కటి చొప్పున వికెట్లు తీశారు.

Match Highlights

ఈ టోర్నీలో వేగవంతమైన అర్థసించరి నమోదు చేసిన బ్యాట్స్మెన్ మరియు కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. 19 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు.

హర్షది సింగ్ ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు (15 వికెట్లు) తీసిన బౌలర్ గా ఆప్ఘనిస్థాన్ బౌలర్ ఫారుఖీ తో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 19 వేలకు పైగా పరుగులు లను రోహిత్ శర్మ సాధించాడు

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు