BIKKI NEWS (NOV. 23) : Team india on top in Perth Test Day 2. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పట్టు బిగించింది.
Team india on top in Perth Test Day 2.
ఆస్ట్రేలియా ను ఈరోజు ఉదయం 104 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యం సాదించింది. బుమ్రా – 5, రాణా – 3, సిరాజ్ – 2 వికెట్లు తీశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా 172/0 పరుగులు సాదించి కీలకమైన 218 పరుగుల ఆధిక్యత ను భారత్ కు కట్టబెట్టారు.
యశస్వీ జైశ్వాల్ – 90, కేఎల్ రాహుల్ – 62 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మొదటి రోజు 17 వికెట్లు పడ్డ పిచ్ పై రెండో రోజు కేవలం 3 వికెట్లు మాత్రమే పడడం విశేషం.
స్కోర్ వివరాలు
టీమిండియా మొదటి ఇన్నింగ్స్ – 150/10
ఆస్ట్రేలియామొదటి ఇన్నింగ్స్ – 104/10
టీమిండియా రెండో ఇన్నింగ్స్ – 172/0