BIKKI NEWS (SEP. 22) : team india beats bangladesh in chepak test. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘనవిజయం సాదించింది. రెండో చివరి టెస్ట్ సెప్టెంబర్ 27 న ప్రారంభం కానుంది.
team india beats bangladesh in chepak test
514 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టును 234 పరుగులకే ఆలౌట్ చేశారు.
ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో అశ్విన్ – 113, జడేజా – 85 పరుగులతో రాణించడంతో 376/10 పరుగులు సాదించింది. హసన్ మహ్మద్ 5 వికెట్లు తీశాడు.
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 149 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా 4 వికెట్లు తీశాడు
టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో గిల్ – 119, పంత్ – 109 పరుగులతో రాణించడంతో 287/4 పరుగులు సాదించింది.
అనంతరం 514 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టును 234 పరుగులకే ఆలౌట్ చేశారు. కెప్టెన్ శాంటో 82 పరుగులు చేశాడు. అశ్విన్ – 6 వికెట్లు తీశాడు.
అశ్విన్ మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతో టీమిండియా ను నిలబెట్టగా, సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో బంగ్లాదేశ్ ను కుప్పకూల్చాడు.