విరాట్ కోహ్లీ వందో టెస్టులో భారత్ శ్రీలంక జట్టు మీద ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ లో 1 – 0 తో నిలిచింది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆల్ రౌండర్ సర్ రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టు సునాయాసంగా గెలుపొందింది.
మొదటి ఇన్నింగ్స్ లో బారత్ 574/8 వద్ద డిక్లేర్ చేసింది. జడేజా 175* రిషబ్ పంత్ 96, అశ్విన్ 61 పరుగులతో రాణించారు. లక్మల్, పెర్నాండో, ఎబుల్డేనియ లు తలో రెండు వికెట్లు సాదించారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులు జడేజా, అశ్విన్ ల స్పిన్ ఉచ్చులో చిక్కి 174 పరుగులకే ఆలౌట్ అయి పాలో ఆన్ లో పడి పోయారు.. జడేజా 5 వికెట్లు, బుమ్రా, అశ్విన్ లు రెండేసి వికెట్లు సాదించారు.
అనంతరం పాలో ఆన్ ఆడుతూ మరల జడేజా, అశ్విన్ ల స్పిన్ ఉచ్చులో చిక్కి 178 పరుగులకు ఆలౌట్ అయ్యరు. డిక్వెల్లా 51* నాటౌట్ గా నిలిచాడు.
జడేజా మరల 4 వికెట్లు, అశ్విన్ 4 వికెట్ల తో రాణించారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన జడేజా 175* పరుగులు నాటౌట్ తో పాటు బౌలింగ్ లో 9 వికెట్లు సాదించాడు.
Follow Us @