లాక్ డౌన్ జూన్ 9 వరకు – సడలింపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు

క‌రోనా నివార‌ణ‌కు తెలంగాణ‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ రోజుతో ముగియ‌నున్న లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం జూన్ 9 వరకు పొడిగించింది.

ఈ మేర‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్ణ‌యం తీసుకున్న‌ది. జూన్ 9వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది.

నేటి వ‌ర‌కు రోజుకు 4 గంట‌లు మాత్ర‌మే మిన‌హాయింపు ఇవ్వ‌గా, ఆ స‌మ‌యాన్ని మ‌రో మూడు గంట‌ల పాటు పొడిగించారు. ఇక ప్ర‌తీ రోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ వ‌ర‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంట‌ల వ‌ర‌కు ఇళ్ళకు చేరుకునేందుకు ప్ర‌భుత్వం వెసులుబాటు క‌ల్పించింది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ఠినంగా లాక్‌డౌన్‌ను అమ‌లు చేయ‌నున్నారు.

Follow Us@