Home > TELANGANA > నూతన జూనియర్ కళాశాలలకు పోస్టులు మంజూరు చేయాలి – కొప్పిశెట్టి

నూతన జూనియర్ కళాశాలలకు పోస్టులు మంజూరు చేయాలి – కొప్పిశెట్టి

BIKKI NEWS (FEB. 07) : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు, ప్రిన్సిపాల్ మరియు టీచింగ్ నాన్, టీచింగ్ పోస్టులను మంజూరు (teaching and non teaching posts sanction for 15 new govt junior colleges) చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వాస్కుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

గతంలో వివిధ జిల్లాల్లో ప్రజల కోరిక మేరకు వివిధ జీవోలు ద్వారా 15 జూనియర్ కళాశాలలను గతంలో మంజూరు చేయడంతో ప్రస్తుతం ఆ కళాశాలలో తాత్కాలికంగా విద్యార్థులకు బోధన నిర్వహిస్తున్నారు. అయితే ఈ కళాశాలకు శాశ్వత ప్రిన్సిపాల్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు శాంక్షన్ చేయకపోవడంతో పూర్తి స్థాయిలో అడ్మిషన్ చేయటంలో, తరగతులు బోధించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ పోస్టులు శాంక్షన్ కు సంబంధించిన ఫైలు ఉన్నత విద్యా శాఖ పరిశీలనలో ఉన్నదని, వీటిని పరిశీలించి వెంటనే పోస్టులను శాంక్షన్ చేయాలని కోరారు. పోస్టులను సాంక్షన్ చేయటం వల్ల 2024 – 2025 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్ పెరగటానికి అవకాశం ఉందని తెలిపారు.

★ నూతన జూనియర్ కళాశాలు

1) దౌలతాబాద్ – వికారాబాద్ జిల్లా
2) చిన్న చింతలకుంటల్, మహబూబ్ నగర్ జిల్లా
3) మహ్మదాబాద్ మండలం హెడ్ క్వార్టర్స్ – మహబూబ్ నగర్ జిల్లా
4) బిబిపేట్ మండలం – కామారెడ్డి జిల్లా
5) నిజాంసాగర్ మండలం- కామారెడ్డి జిల్లా
6) నాగిరెడ్డిపేట మండలం – కామారెడ్డి జిల్లా
7) బషీర్ బాద్ మండలం – వికరాబాద్ జిల్లా
8) పెద్దకొత్తపల్లి – కల్లాపూర్ – నాగర్‌కర్నూల్ జిల్లా
9) కందుకూరు, వేంసూరు (మండలం ) ఖమ్మం జిల్లా,
10) బీర్కూర్ – కామారెడ్డి జిల్లా
11) మీర్పేట్, బాలాపూర్ మండలం – రంగారెడ్డి జిల్లా
12) తలకొండపల్లి ,రంగారెడ్డి జిల్లా
13) కమ్మరపల్లి మండలం నిజాంబాద్ జిల్లా
14) కుంటాల – నిర్మల్ జిల్లా
15) నార్కెట్ పల్లి – నల్లగొండ జిల్లా