TEACHERS TRANSFERS :సర్వీస్ రెండేళ్ళు లేకున్నా బదిలీలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 12) : తెలంగాణ రాష్ట్రం లో టీచర్ల బదిలీ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్ల సర్వీసు లేని టీచర్ల దరఖాస్తులను కూడా బదిలీల కోసం పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రెండేళ్ల సర్వీసున్న టీచర్లే బదిలీకి అర్హులన్న నిబంధనపై విచారణ జరిపిన కోర్టు.. రెండేళ్ల సర్వీసున్న టీచర్ల బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలకు రెండేళ్ల సర్వీసు లేని వారిని పరిగణించాలని పేర్కొంది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.