బదిలీల కోసం విద్యా శాఖ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉపాధ్యాయ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో… బదిలీల కోసం విద్యా శాఖ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు

ఈ నెల 3 నుంచి 5 వరకు దరఖాస్తులు అన్‌లైన్‌లో సమర్పించాలి.

6,7 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలి.

8, 9 తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు అధికారులు డిస్‌ప్లే చేయాలి.

10,11 అభ్యంతరాల స్వీకరణ

12,13 సీనియారిటీ జాబితాలను డిస్‌ప్లే చేస్తారు

14న ఎడిట్‌ చేసుకునేందుకు ఆప్షన్‌

15న ఆన్‌లైన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు

16న ప్రధానోపాధ్యాయుల ఖాళీలను ప్రదర్శిస్తారు.

17,18,19 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంలుగా పదోన్నతులు

20,21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ప్రదర్శన

21న వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలి

22 ఎడిట్‌ ఆప్షన్‌ను వినియోగించుకునే అవకాశం

23,24 స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలు

24 స్కూల్‌ అస్టింట్‌ ఖాళీల ప్రదర్శన

26,27,28 ఎస్టీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు

29,30,31 ఎస్టీటీ ఖాళీల ప్రదర్శన

అక్టోబర్‌ 2న ఎడిట్‌ ఆప్షన్స్‌ ఉంటాయి.

అక్టోబర్‌ 3న ఎస్టీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు

అక్టోబర్‌ 5 నుంచి 19వరకు అప్పీల్‌ చేసుకునే అవకాశం.

ప్రతిపాదిత నిబంధనలు ఇవే..

ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ శుక్రవారం వచ్చే అవకాశమున్న నేపథ్యంలో గురువారం జిల్లా విద్యాధికారులతో రాష్ట్ర విద్యశాఖాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాగా.. రాష్ట్ర విద్యాశాఖ పంపిన ప్రతిపాదనల ప్రకారం చూస్తే నిబంధనలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబర్‌ ఒకటో తేదీ కటాఫ్‌ డేట్‌గా లాంగ్‌ స్టాండింగ్‌కు ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాల నిబంధన వర్తించేలా ప్రతిపాదించింది.
5/8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు/ ప్రధానోపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా జాబితాలో చేరుస్తారు.
రిటైర్మెంట్‌కు మూడు సంవత్సరాలలోపు సర్వీసున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంది.
అన్ని రకాల పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చారు
కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, ఎడిట్‌ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.గతంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను ఎడిట్‌ చేసుకునే అవకాశాన్ని, అదనంగా స్పాజ్‌ బదిలీలకు పాయింట్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
సెప్టెంబర్‌ ఒకటి నాటికి 50 సంవత్సరాల లోపు వయసు ఉండి బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్బంధ బదిలీ వర్తింప జేస్తూ ప్రతిపాదనలు పంపింది