TEACHERS : నేడే బదిలీల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (సెప్టెంబర్ – 01) : తెలంగాణ హైకోర్టు ఉపాధ్యాయ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల కోసం చర్యలు వేగవంతం చేసింది. సంఘ నాయకులకు ఇచ్చిన 10 పాయింట్లు తొలగించి. భార్య భర్తల బదిలీలకు పాయింట్లు యధాతధంగా కొనసాగిస్తూ బదిలీలు చేసుకోమని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

గతంలో విడుదల చేసిన బదిలీల షెడ్యూల్ ప్రకారం బదిలీల అర్హుల కట్ ఆఫ్ తేదీ ఫిబ్రవరి 1 గా ఉండగా… అది సెప్టెంబర్ ఒకటిగా మార్చినట్లు సమాచారం. దీంతో బదిలీలకు అర్హుల సంఖ్య గతంలో వచ్చిన 58 వేల కంటే ఎక్కువ కానుంది. టీచర్లు 8 సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులు ఐదు సంవత్సరాలు ఒకే చోట పని చేస్తే తప్పనిసరి బదిలీకి అర్హులుగా భావిస్తారు.

సెప్టెంబర్ 3 నుండి బదిలీల సంబంధించి దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్ మొదటివారం కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెంచుకున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు.

ఉపాధ్యాయ బదిలీలతో పాటు పదోన్నతులు కూడా చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఎస్జిటీల నుండి స్కూల్ అసిస్టెంట్లు, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు… స్కూల్ అసిస్టెంట్ ల నుండి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వంటి పదోన్నతులు కలవు.

పదోన్నతులు చేపడితే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా 1,947 మందికి అవకాశం లభించనుంది.

ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ లుగా 2,162 మందికి పదోన్నతి అవకాశం లభిస్తుంది

స్కూల్ అసిస్టెంట్లుగా 5,870 మందికి అవకాశం లభించనుంది.

పదోన్నతులు చేపట్టిన పిమ్మట మిగిలిన ఖాళీలను ఇప్పటికే విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెంచడమా… ప్రత్యేక డిఎస్సి వేయడమా అనేది ప్రభుత్వం తర్వాత నిర్ణయం తీసుకోనుంది.