హైదరాబాద్ (సెప్టెంబర్ – 18) : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల (teachers transfers in telangana) ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 17న 1,788 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను బదిలీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో మల్టిజోన్-1 పరిధిలో 1000 మంది, మల్టిజోన్-2 పరిధిలో 788 మంది ఉన్నారు. వీరు తమ బదిలీ ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకొని, నిర్దేశిత తేదీల ప్రకారం బదిలీ స్థానాల్లో చేరాలని విద్యా శాఖ ఆదేశించింది.