స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు 28, 29న వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 27) : తెలంగాణ రాష్ట్ర ఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు (school assistant transfer schedule released) పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. మల్టీ జోన్-1లో 19 జిల్లాల్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, మల్టీ జోన్-2లో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని వారికే బదిలీలు జరపాలని విద్యా శాఖ నిర్ణయించింది.

అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో తమకు కావాల్సిన పాఠశాలలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 30న వివరాలను సవరించుకోవడానికి అవకాశం ఇచ్చారు. స్పౌజ్ పాయింట్లు వినియోగించుకుంటున్న వారు తమ భార్య లేదా భర్త పని చేస్తున్న ప్రాంతానికి దగ్గర్లోని పాఠశాలలను మాత్రమే ఎంచుకోవాలని, ఈ మేరకు డీఈఓలు పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన మంగళవారం ఆదేశించారు.