ఆగస్టు 1 నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. క‌రోనా వ‌ల్ల గ‌డిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని తెలిపారు. విద్యార్థుల‌కు న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఆన్‌లైన్‌లో బోధ‌న చేశాం. గ‌తేడాది 70 శాతం సిల‌బ‌స్‌తోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని చెప్పారు. విద్యార్థుల్లో ఒత్తిడి త‌గ్గించేందుకు కౌన్సెలింగ్‌లు కూడా నిర్వ‌హించామ‌ని పేర్కొన్నారు.

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు ఆగ‌స్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం. ఈ నెల 30 నుంచి ప‌రీక్ష ఫీజు స్వీక‌రిస్తాం. రీ కౌంటింగ్, రీ వెరిఫికేష‌న్ కూడా అవ‌కాశం క‌ల్పించామ‌ని మంత్రి తెలిపారు. ఆగ‌స్టు చివ‌రి నాటికి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు.

ntnews

Follow Us @