2 శాతం మాత్రమే టీడీఎస్ పై హర్షం వ్యక్తం చేసిన TGPLA – C

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ అధ్యాపకుల వేతనాలలో 2% TDS కోత విధించాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.

2018లో ఆదాయపన్ను శాఖ ఇచ్చిన మెమో ప్రకారం 194 (J) సెక్షన్ ప్రకారం 2 శాతం కోత విధించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ యూనియన్ (TGPLA – C) అధ్యక్షుడు జి. ఉమా శంకర్, ప్రధాన కార్యదర్శి అస్మతుల్లా ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. అరుణ్ ఇమ్మాన్యుయోల్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే కమీషనర్ నవీన్ మిట్టల్ కు, ఆర్జేడీ పుల్లయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్, డిగ్రీ అధ్యాపకులకు కూడా 10% టిడీఎస్ విధిస్తూ వేతనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వు నేపథ్యంలో వారికి కూడా ఇదే తరహాలో ఉత్తర్వులు త్వరలో అమలు అయ్యే అవకాశం కలదు.