కాంట్రాక్ట్ లెక్చరర్స్ వేతనాల్లో 10 శాతం కోత విధించవద్దు – ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విజ్ఞప్తి.

ప్రభుత్వ జూనియర్ , డిగ్రీ , మరియు పాలిటెక్నిక్ కళాశాల లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ వేతనాల్లో 10 శాతం కోత విధించవద్దని ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు వేతనాల్లో 10 శాతం deduction చేయాలని ఈ మధ్య కాలంలో ఆదాయపన్ను శాఖ నుంచి డ్రాయింగ్ ఆఫీసర్లకు నోటీసులు రావడంతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అసోసియేట్ అధ్యక్షులు G. రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి .సురేష్, శోభన్ బాబు హైదరాబాదులోని ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులను కలిసి ఈ సమస్యను వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్స్ అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని, అలాంటప్పుడు వేతనాల్లో ప్రతి నెల 10% కోత విధించడం వల్ల వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉందని, ఈ విషయంలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు సరైన న్యాయం జరిగినట్టు చూడవలసిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

Follow Us@