BIKKI NEWS (నవంబర్ – 16) : TATA CONSULTANCY SERVICES – NATIONAL QUALIFYING TEST (TCS NQT 2023) పరీక్ష కోసం దరఖాస్తు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.
TCS NQT పరీక్ష డిసెంబర్ 9న నిర్వహించనున్నారు. ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు కోసం నవంబర్ 27 వరకు గడువు కలదు చేసుకోవచ్చు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ కోసం TCS NQT 2023 పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటే.. కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగాలకై ఇది అర్హత పరీక్షగా ఉపయోగపడుతుంది.
2018 నుంచి 2024 వరకు విద్యా సంవత్సరాల్లో బీటెక్ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల వయసు 17 – 30 ఏళ్ల మధ్య ఉండాలి. టీసీఎస్ ఎన్ క్యూటీలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.