Tax On Farmers – దేశంలో ధనిక రైతులపై పన్ను.!

BIKKI NEWS (JAN. 18) : భారతదేశంలోని ధనిక రైతులపై పన్ను విధించే (Tax on rich farmers in india) అంశాన్ని కేంద్రం పరీశీలన చేయాలని రిజర్వ్‌బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్‌ అన్నారు. వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అషిమా గోయల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భారత్‌లో వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించటం సబబేనా అన్న ప్రశ్నకు బుధవారం ఓ కార్యక్రమంలో ఆమె సమాధానమిస్తూ ‘పేద రైతులకు ప్రభుత్వం నగదు బదిలీ చేయటం రుణాత్మక ఆదాయ పన్నులాంటిది. అలాగే ధనిక రైతులపై తక్కువ శాతంలో ధనాత్మక ఆదాయ పన్ను విధించటం సబబుగానే ఉంటుంది’ అని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలతో స్వల్పకాలిక ఆర్థిక వృద్ధి మాత్రమే సాధ్యమవుతుందని, ఏక పార్టీ ప్రభుత్వాల వల్ల దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి నమోదవుతుందని తెలిపారు.