మీ కెరీర్ కు అనేక మార్గాలు చూపే TASK లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా.?

తెలంగాణలోని యువతీయువకులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) (TASK) ద్వారా శిక్షణ ఇస్తోంది. 

2020-21 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ విడుదలైంది.  TASK రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. 

● ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ::

BE, B.Tech, B.Pharmacy, MCA, MBA, PGDM, BA, BSc, B.Com, BCA, BBM, BBA, MA, M.Sc, M.Com, Polytechnic  – విద్యార్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది 

పైన వెల్లడించిన కోర్సుల్లో మొదటి, రెండో, మూడో, నాలుగో సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు.

◆ రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు :: 

● బీఈ, బీటెక్ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.1416, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.708, 

● డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ, ఫార్మసీ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.590, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.295,

● పాలిటెక్నిక్ విద్యార్థులు రూ.295 ఫీజు చెల్లించాలి. 

◆ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చివరి తేదీ ::   డిసెంబర్ 27  – 2020

TASK రిజిస్టర్ చేసుకోవడానికి, మీ అకాడమిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులతో  సంబంధం లేదు. విద్యార్థులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. 

ఒక్కసారి టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితాంతం వేలిడిటీ ఉంటుంది. 

● TASK కల్పించే అవకాశాలు ::

* పరిశ్రమ సంబంధిత కోర్సులు అందుబాటులో ఉంటాయి.

* విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు.

* సంబంధిత పరిశ్రమల్ని సందర్శించే అవకాశం లభిస్తుంది.

* ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయి. 

* నిపుణులతో మాట్లాడొచ్చు.

*  పలు సంస్థలు నిర్వహించే ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో పాల్గొనొచ్చు.

* ఇ-లెర్నింగ్ కంటెంట్‌ని ఆన్‌లైన్, మ్యాసీవ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు చేయొచ్చు. 

* కెరీర్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్‌లో పాల్గొనొచ్చు. 

● పూర్తి వివరాలకు & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్సైట్ ::

https://www.task.telangana.gov.in/

Follow Us@