మోడల్ స్కూల్ అవర్లీ బేసిస్ టీచర్లు, పీడీల రెన్యూవల్ ఉత్తర్వులపై హర్షం – తరాల జగదీష్

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ లలో పని చేస్తున్న అవర్లీ బేసిస్ టీచర్స్, ఫిజికల్ డైరెక్టర్లలను 2021 – 22 విద్యా సంవత్సరానికి ఎంగేజ్ చేస్తూ ఉత్తర్వులు నేడు విడుదల కావడం పట్ల PMTA (TS) సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ హర్షం వ్యక్తం చేశారు

ఈ ఉత్తర్వులు మేరకు 1047 మంది అవర్లీ బేసిస్ గెస్ట్ టీచర్లు, 194 మంది హిందీ అవర్లీ బేసిస్ గెస్ట్ టీచర్లు, 194 మంది ఫిజికల్ డైరెక్టర్ ల నియామాకానికి అనుమతి లభించింది.

PMTA TS రాష్ట్ర సంఘ వినతి మేరకు ఈ ఉత్తర్వులు విడుదల కు సహకరించిన విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కమీషన్ దేవసేన, మోడల్ స్కూల్ ల అదనపు సంచాలకులు ఉషారాణి లకు ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( PMTA TS) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలపడం జరిగింది