జాతీయ చిహ్నాల విలువలను జీవింప చేయాలి : అస్నాల శ్రీనివాస్
దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్రోద్యమ వజ్రోత్సవ సంబరాల్లో నడయాడుతున్నారు. తమకు స్వేచ్ఛను, ఆత్మగౌరవ బాటలు చూపిన వారిని, తమ జీవితం సుసంపన్నం కావడానికి త్యాగాల పునాదులు వేసిన వారిని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి నినాదాల్లో అమరులను బ్రతికించుకుంటున్నారు. వారి గొంతులలో పాటలుగా …