నెలకు 50వేల స్టైఫండ్ తో ఫెలోషిప్ కు అవకాశం కల్పిస్తున్న టీ వర్క్స్

హైదరాబాద్ (మే – 09) : దేశంలోనే అతి పెద్ద ప్రొటో టైపింగ్ కేంద్రమైన టీ వర్క్స్ లో ఫెలోషిప్ ( T – WORKS FELLOWSHIP 2023) ప్రోగ్రాం-2023 నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మే – 14 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్ అండ్ డిజైన్, ప్రొటోటైపింగ్ మాన్యుఫ్యాక్చర్, ప్రొటోటైపింగ్ సర్వీసెస్, ప్లాంట్ ఆపరేషన్స్, మీడియా అండ్ కంటెంట్, బిజినెస్ డెవలప్మెంట్, ప్రొక్యూర్మెంట్, ఆర్చీ వింగ్, క్యురేషన్, మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ వంటి విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు.

ఎంపికైనవారికి 12 నెలలు శిక్షణతోపాటు ప్రతినెలా సీనియర్ ఫెలోషిప్ రూ.65 వేలు, రూ.50 వేల గౌరవవేతనం ఉంటుందన్నారు.

వెబ్సైట్ : https://tworks.telangana.gov.in/fellowship