T – HUB RECRUITMENT : అక్టోబర్ 14న టీ హబ్ లో జాబ్ మేళా

హైదరాబాద్ ( సెప్టెంబర్ – 21) : T – HUB లో అక్టోబర్ – 14 రిక్రూట్మెంట్ డ్రైవ్ (t hub recruitment drive on 14th October 2023) నిర్వహిస్తున్నామని, అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని నిర్వహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు టీ హబ్ వెబ్సైట్ ను సందర్శించాలని పేర్కొన్నారు.

రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా నైపుణ్యం కలిగిన వారికి ఎంపిక చేసుకునేందుకు స్టార్టప్ కంపెనీలకు అవకాశం ఉంటుందని, ఇక్కడి నుంచి తమకు అవసరమైన నిపుణులను ఎంపిక చేసుకొని ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఇది మంచి వేదికని నిర్వహకులు చెప్పారు.

అక్టోబర్ 14న నిర్వహించే ఈ డ్రైవ్ స్టార్టప్ వ్యవస్థాపకులతో పాటు ఔత్సాహిక వ్యాపారవేత్తలు పాల్గొనవచ్చని ఒక ప్రకటనలో సూచించారు.

రిజిస్ట్రేషన్ లింక్ : https://bit.ly/46k9kV9