CURRENCY NOTES : కరెన్సీ నోట్లు మీద గుర్తుల విశేషాలు

BIKKI NEWS : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముద్రించిన నూచన భారతీయ కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మతో పాటు వివిధ వారసత్వ కట్టడాలను, ప్రముఖ సంఘటనలకు గుర్తులను (symbols on indian currency notes) ముద్రించింది.

కరెన్సీని ముద్రించే అధికారం కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. గాంధీ బొమ్మతో కూడిన కరెన్సీ నోట్లను 1966 నుండి ముద్రించడం మొదలుపెట్టింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10, 20, 50, 100, 200, 500, 2,000 రూపాయల కరెన్సీ నోట్లను ప్రస్తుతం ముద్రిస్తుంది. తాజాగా ఆర్బీఐ 2,000రూపాయల నోటు ను ఉపసంహరించుకుంది.

కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 30 2016 నాడు అప్పటివరకు అమలులో ఉన్న 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నూతన నోట్లను డిసెంబర్ – 31 – 2016 నుండి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నూతన నోట్ల మీద గాంధీ బొమ్మ తో పాటు వివిధ భారత వారసత్వ సంపదలు, గుర్తులను ముద్రించింది.

నోటు విలువగుర్తు
₹10ఆశోక చక్రం – కోనార్క్ సూర్య దేవాలయం – (ఒడిశా)
₹20ఎల్లోరా గుహలు – (మహారాష్ట్ర)
₹50హంపి దేవాలయం- (కర్ణాటక)
₹100రాణి కా వావ్ – (రాణి గారి మెట్ల బావి) – గుజరాత్
₹200సాంచి స్థూపం (మద్యప్రదేశ్)
₹500ఎర్ర కోట (న్యూడిల్లీ)
₹2,000మంగళయాన్ శాటిలైట్