INDvsAUS – సిడ్నీ టెస్టులో కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా

BIKKI NEWS (JAN. 03) : Sydney test team india captain bumrah. బోర్డర్ భాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి 5వ టెస్ట్ లో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో టీమిండియా ఆడుతుంది.

Sydney test team india captain bumrah

కెప్టెన్ రోహిత్ శర్మ స్వచ్ఛందంగా ఈ టెస్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. రోహిత్ శర్మతో పాటు ఆకాష్ దీప్ కు ఈ టెస్టులో చోటు దక్కలేదు. ఆకాష్ దీప్ బదులు ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతున్నాడు. రోహిత్ శర్మ బదులుగా శుభమన్ గిల్ బరిలోకి దిగాడు.

టాస్ గెలిచిన టీమిండియా పచ్చిక ఎక్కువగా ఉన్న పిచ్ పై మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

నిపుణుల అంచనా ప్రకారం రోహిత్ శర్మ తన చివరి టెస్టును మెల్బోర్న్ వేదికగా ఆడాడాని భావిస్తున్నారు. ఈ టెస్ట్ సమయంలోనే రోహిత్ శర్మ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికే ప్రకటన వెలువడవచ్చని అంచనాలు ఉన్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు