Home > UNCATEGORY > జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్

జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్

BIKKI NEWS (AUG. 27) : Swacch bharath programme in GJC girls Husnabad. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

Swacch bharath programme in GJC girls Husnabad

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కందుల శోభా దేవి గారు మాట్లాడుతూ… విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుపుతూ సామాజిక కార్యక్రమాల్లో చైతన్యవంతంగా పాల్గొనాలి అన్నారు. విద్యార్థినిలు మరియు సమాజంలోని పౌరులందరూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమాజంలోని పౌరులందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు సమాజం ప్రగతి పథంలో నడుస్తుందని అన్నారు.

అనంతరము విద్యార్థినిలు ఆరు గ్రూపులుగా ఏర్పడి కళాశాల ప్రాంగణంలోని ముళ్ల పొదలను చెత్తాచెదారాలను తొలగించారు. మట్టిని నేర్పి నేలను చదునుగా చేశారు. చెట్లకు పాదులు చేసి నీటిని పోయడం జరిగింది.ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కరుణార్ యొక్క పర్యవేక్షణలో జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం డి రవీందర్, ఎస్. సదానందం, టి. నిర్మల దేవి, బి. లక్ష్మయ్య, ఏ. సంపత్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినిలు మొదలగు వారు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు