కృతజ్ఞత సభకు భారీగా సూర్యాపేట జిల్లా సీజేఎల్స్ – మారం హేమచందర్ రెడ్డి

ఈ రోజు సిద్దిపేటలో కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ చైర్మన్ కనకచంద్రం పిలుపు మేరకు హరీష్ రావు ముఖ్య అతిధిగా ఈరోజు సిద్దిపేటలో కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ విజయవంతం చేయాలని కనకన్న పిలుపు మేరకు హరీష్ రావు అన్న మీద ఉన్న అభిమానంతో 37 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు సూర్యాపేట జిల్లా తరఫున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగిందని మారం హేమచందర్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో TGCCLA-711 సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ నూతన పీఆర్సీ ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకుల బేసిక్ పే వచ్చేల కృషి చేసిన TGCCLA-711 రాష్ట్ర అధ్యక్షుడు మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ చైర్మన్ సీ.హెచ్. కనకచంద్రంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడం జరిగింది.

కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అనేక సమస్యలు పరిష్కరించారని ఉద్యోగ భద్రత, బదిలీలు, కరోన బాధితులకు సహకారం తదితర సమస్యలు కూడా పరిష్కరించాలని కోరడం జరిగింది.

ఈ సమావేశానికి సూర్యాపేట జిల్లా నుంచి హాజరైన నాయకులు జి.నవీన్ కుమార్ ఎన్.ఈశ్వర్ , కృష్ణ, చంద్ర మౌళి, మహేష్, పుల్లయ్య ,గణేష్ , రాంమూర్తి కుమారస్వామి నాగుల్ మీరా, రమేష్ శర్మ, అంజయ్య, అశోక్, దశరథ తో పాటు జిల్లా నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.