- కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం
న్యూడిల్లీ (సెప్టెంబర్ 19 ) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 16 పై నిరుద్యోగులు వేసిన కేసును ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఇప్పటికే పలుమార్లు తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలిస్తూ జీవో నెంబర్ 16 పై వేసిన పలు కేసులను కొట్టివేయడమే కాక పిటిషన్ దార్లకు జరిమానాలు కూడా విధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం కానుంది. ఇప్పటికే పలు శాఖల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు చేరి క్రమబద్ధీకరణకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.