హైదరాబాద్ (డిసెంబర్ – 11) : తెలంగాణలోని నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ లో తాత్కాలిక ఉద్యోగులైన NMR, FTC, PTC మరియు ఔట్‌సోర్సింగ్ లస్కర్ ల పదవి విరమణ వయస్సు పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 యాక్ట్ – 3 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు ను 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగుల పదవి విరమణ వయస్సు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు లేనందున ప్రభుత్వ ఉద్యోగులకు అనుసరిస్తున్న పదవి విరమణ వయస్సునే అనుసరించాలని స్పష్టత ఇవ్వడం జరిగింది.
కేవలం నీటిపారుదల శాఖకు కాకుండా అన్ని శాఖలలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 61 సంవత్సరాలు కల్పించాలని పలు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాయి
Follow Us @