75 మంది విద్యార్థులకు కరోనా.

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కోరుట్ల లోని ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, సిబ్బందికి కలిపి 75 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ చెప్పారు.

డిగ్రీ చదువుతున్న వివిధ గ్రామాలకు చెందిన 280 మంది విద్యార్థులకు శనివారం కరోనా పరీక్షలు చేశారు 67 మంది స్టూడెంట్లకు 8 మంది సిబ్బందికి కరోనా ఉన్నట్లు తేలింది.

గత సోమవారం నుండి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కావడంతో 258 మంది విద్యార్థులు కళాశాలకు హాజరై తరగతులకూ హాజరు అవుతున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు జ్వరం రావడంతో అనుమానంతో కరోనా టెస్ట్ చేశారు. దాంతో 75 మంది దానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిని స్థానిక హాస్టల్ రూమ్ లో ఐసోలేషన్ చేసినట్లు వైద్యాధికారి శ్రీధర్ చెప్పారు. హాస్టల్ లో కరోనా వ్యాపించడంతో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టామని తెలిపారు.

పాజిటివ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ చేసి మిగతా విద్యార్థులను ఇళ్లకు పంపడంతో వైద్యాధికారి అసహనం వ్యక్తం చేశారు.

రూల్స్ కు విరుద్ధంగా రెండు నెలలుగా 200 మంది సీనియర్ స్టూడెంట్లకు క్లాసు నిర్వహిస్తున్నారని తాము ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోలేదని సిబ్బంది వాపోయారు ఇప్పుడు తమకు ఎంతో ఇంటికి వెళ్లాలి ఎక్కడ ఉండాలో తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us@