మార్చి 4న పాఠశాలల్లో కథల పోటీలు

  • మన ఊరు-మన చెట్టు పేరిట నిర్వహణ
  • సాహిత్య అకాడమీ కొత్త ప్రయత్నం

తెలంగాణ సాహిత్య అకాడమీ, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మార్చి 4న పాఠశాల విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, కన్నడం, మలయాళం, గిరిజన తెగల భాషలతో సహా ఏ భాషలోనైనా కథలు రాయొచ్చునని, లిపిలేని గిరిజన తెగల విద్యార్థులు కూడా తాము మాట్లాడే భాషనే తెలుగులో రాయొచ్చని పేర్కొన్నారు. కుల-మతాల ఐక్యత, హిందూ-ముస్లిం ఐక్యత, దేవాలయాలు, చెరువులు, పంటపొలాలు, ఇంటి సమస్య, గ్రామ సమస్య, చెట్టు ఇలా ఏ అంశానైన్నా ఇతివృత్తంగా తీసుకొని కథలు రాయొచ్చని తెలిపారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. విద్యార్థులకు తాము మాట్లాడే భాషలో కూడా కథలు రాసే అవకాశం కల్పిస్తారు.

మన ఊరు-మన చెట్టు పేరుతో రాష్ట్రంలోని 20 వేలకు పైగా పాఠశాలల్లో పోటీలను నిర్వహిస్తారు. ఒక్కొక్క జిల్లా 3 నుంచి 30 చొప్పున ఉత్తమ కథలను ఎంపిక చేసి, మొత్తం 1,000 కథలతో పుస్తకం ప్రచురిస్తారు. ఉత్తమ కథలు రాసిన విద్యార్థులకు తెలంగాణ సాహిత్య అకా డమీ నుంచి ప్రశంసాపత్రాలు అందజేస్తారు.

Follow Us @