టీచర్ల బదిలీలపై స్టే పొడిగింపు – హైకోర్టు

  • జూలై – 11 న విచారణ

హైదరాబాద్ (జూలై 04) : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల11 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మధ్యంతర ఆదేశాలను జారీచేసింది. ఉపాధ్యాయ బదిలీల కోసం జారీచేసిన జీవో 9కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ సోమవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.

పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జారీచేసిన ఆ జీవోను రద్దు చేయాలని లేదంటే టీచర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లతోపాటు మరికొందరికి స్పౌజ్ క్యాటగిరీ కింద ఎలాంటి అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ వాదించారు. దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు స్పందిస్తూ.. రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నందున జీవో 9పై స్టేను రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి బదిలీలు చేపడతామని చెప్పారు.

మరిన్ని వార్తలు :