శాంతిభద్రతల పరిరక్షణ లో రాజీలేదు – సీఎం రేవంత్

BIKKI NEWS (JULY 16) : State peace and protection is first priority. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.

State peace and protection is first priority

ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో న్యాబ్, ఎక్సైజ్, పోలీసు విభాగాల్లోని అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు.

కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయంలో రోజంతా జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల కాపాడటంలో తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి గారు దిశానిర్ధేశం చేశారు.

పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూలు చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్ హెచ్ వోల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గతేడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించగా, వాటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని హెచ్చ‌రించారు.

అట‌వీ భూముల్లో పండ్ల మొక్క‌లు నాట‌డాన్ని ప్రోత్సహించి తద్వారా గిరిజ‌నుల‌కు ఆదాయం పెంచాలి.

ప్రాజెక్టు కట్టలు, కాలువ గట్టులు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు ఒకేచోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటునకు స్థలాలు ఎంపిక చేయాలి.

కలెక్టర్లు విధిగా పాఠశాలలను తనిఖీ చేయాలి. డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలి. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టివిక్రమార్క తోపాటు మంత్రివర్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు