విజయవాడ (డిసెంబర్ – 03) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
ఇటీవల 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి అదనంగా 496 పోస్టులను కలిపి మొత్తం 957 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలు వెబ్సైట్లో ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తు లను సంబంధిత రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంట లలోపు సమర్పించాల్సి ఉంటుంది.
Follow Us @