హైదరాబాద్ (జూన్ – 12) : తెలంగాణ మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) 5,204 STAFF NURSE JOBS భర్తీ కోసం ఆగస్టు 02 న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్దతిలో నిర్వహించనుంది.
OMR విధానంలో 80 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు 80 మార్కులకు, 80 నిమిషాల సమయం పాటు పరీక్ష నిర్వహించనున్నారు.
మొత్తం 40,906 మంది ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
ఆగస్టు 02 న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మూడు షిప్ట్ లలో జరగనుంది. ఒక షిప్ట్ లో మాత్రమే ఒక అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు.
మొదటి షిఫ్ట్ ఉదయం 9.00 – 10.20 వరకు.., రెండో షిప్ట్ మధ్యాహ్నం 12.30 – 01.50 వరకు…, మూడో షిప్ట్ సాయంత్రం 04.00 – 5.20 వరకు నిర్వహించనున్నారు.
అభ్యర్థులు హల్ టికెట్లు జూలై 23 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు
మార్కుల కేటాయింపు రాత పరీక్ష 80 మార్కులకు మరియు కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సర్వీస్ ను బట్టి 20 మార్కుల వెయిటేజ్ కలిపి ఫలితాలు వెల్లడించనున్నారు.
◆ స్టాఫ్ నర్సు రాత పరీక్ష సిలబస్
- ఫస్ట్ ఎయిడ్,
- సైకాలజీ,
- సోషియాలజీ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్,
- కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్,
- ఎన్విరాన్మెంటల్ హైజీన్
- హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్,
- న్యూట్రిషన్,
- మెడికల్ సర్జికల్ నర్సింగ్,
- మెంటల్ హెల్త్ నర్సింగ్,
- చైల్డ్ హెల్త్ నర్సింగ్,
- మిడ్ వైఫరీ గైనకాలజికల్ నర్సింగ్,
- గైనకాలజికల్ నర్సింగ్,
- కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్,
- నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇంట్రడక్షన్ టు రీసెర్చ్
- ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్
- నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్.