హైదరాబాద్ (డిసెంబర్ – 30) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
5,204 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్లో 757 పోస్టుల సహా మరికొన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 20 పాయింట్లు వెయిటేజ్ కేటాయించనున్నారు.
◆ దరఖాస్తు ప్రారంభం : జనవరి 25 – 2023
◆ దరఖాస్తు ముగింపు : ఫిబ్రవరి 15 – 2023
◆ దరఖాస్తు పద్ధతి : ఆన్లైన్ ద్వారా
◆ పోస్టుల సంఖ్య : 5,204
◆ అర్హతలు : G.N.M. & బియస్సీ నర్సింగ్
◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
◆ దరఖాస్తు ఫీజు : 500/- + 120/-
◆ పరీక్ష విధానం : 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. (ఇంగ్లీష్ మీడియంలో)
◆ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్.