STAFF NURSE JOBS : నేడే స్టాఫ్ నర్స్ ఉద్యోగ పరీక్ష

హైదరాబాద్ (ఆగస్టు- 02) : తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకై నేడు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)ని మూడు సెషన్స్ లలో MHSRB నిర్వహించనుంది. పరీక్ష కేంద్రానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదు.

ఉదయం సెషన్ – 9.00 గంటలకు, మధ్యాహ్నం సెషన్ 12.30 కు, సాయంత్రం సెషన్ 4 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ నోటిఫికేషన్ కు 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.