టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది హజరు కావాలి – ఇంటర్ కమీషనర్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలను మూసివేయాలని విద్యాశాఖ మంత్రి శాసనసభలో చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యా కమీషనర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల వెంటనే మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే ఆన్లైన్ తరగతుల మానీటరింగ్ చేయడానికి మరియు విద్యార్థులకు వచ్చే సమస్యలను పరిష్కరించడం కోసం టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఖచ్చితంగా కళాశాలలకు హాజరు కావాలని ఉత్తర్వులలో తెలిపారు

రాబోయే పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో వాట్సాప్, జూమ్ యాప్ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారికి వచ్చే విద్యా సంబంధ సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వులలో తెలిపారు.

Follow Us@