గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ అమలుకు ఉత్తర్వులు జారీ

  • అక్టోబర్ – 01 – 2022 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు
  • జనాభా దామాషా పద్దతిలో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 30) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తూ ఈరోజు నోటిఫికేష‌న్ జారీ చేశారు. అక్టోబర్ 01 – 2022 నుంచి 10% రిజ‌ర్వేష‌న్ల పెంపు అమ‌ల్లోకి వ‌స్తుంది.

గిరిజ‌నుల‌కు అమ‌ల‌వుతున్న ఆరు శాతం రిజ‌ర్వేష‌న్ల స్థానంలో గిరిజ‌నుల జ‌నాభాకు అనుగుణంగా వారి రిజ‌ర్వేష‌న్ 10 శాతానికి పెంచాల‌ని ఇంత‌కుముందే రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించి.. రాష్ట్ర‌ప‌తి అనుమ‌తి కోసం కేంద్రానికి పంపింది. ఏడేండ్లు దాటినా గిరిజ‌నుల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుప‌లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.