హైదరాబాద్ (ఎప్రిల్ – 21) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd, ఫిజికల్ ఎడ్యుకేషన్ (BPEd) కోర్సుల్లో ప్రవేశాలకు ఎస్టీ కేటగిరి రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి (10% ST RESERVATIONS) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల ద్వారా జరిగే ప్రవేశాలకు ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.