Home > SCIENCE AND TECHNOLOGY > SSLV D2 : ప్రయోగం విజయవంతం

SSLV D2 : ప్రయోగం విజయవంతం

తిరుపతి (ఫిబ్రవరి – 10) : స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV-D2) ఫిబ్రవరి 10, 2023న 09:18 గంటలకు శ్రీహరికోటలోని SDSC SHARలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి విజయవంతంగా ప్రయోగించారు.

SSLV-D2 యొక్క 15 నిమిషాల ప్రయోగంలో ఎర్త్ ఆర్బీట్ శాటిలైట్ – 07 (EOS-07), Janus-1 మరియు AzaadiSAT-2 ఉపగ్రహాలను 450 కిమీ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు.

EOS-07 అనేది 156.3 కిలోల ఉపగ్రహం, ఇది ఇస్రోచే రూపొందించబడి.. అభివృద్ధి చేయబడింది. కొత్త ప్రయోగాలలో mm-వేవ్ హ్యూమిడిటీ సౌండర్ మరియు స్పెక్ట్రమ్ మానిటరింగ్ పేలోడ్ ఉన్నాయి.

జానస్-1, 10.2 కిలోల ఉపగ్రహం USAలోని ANTARISకి చెందినది.

AzaadiSAT-2 అనేది 8.7 కిలోల ఉపగ్రహం. ఇది చెన్నైలోని స్పేస్ కిడ్జ్ ఇండియా పాఠశాల ద్వారా అబివృద్ది చేయబడింది. 750 మంది బాలికల సంయుక్తంగా అభివృద్ధి చేశారు.